ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో గెలుపొందడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఇస్తున్న ఆలవిగాని ఉచిత హామీలు, వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే సంక్షేమ పథకాలు ఆచరణ సా ధ్యమా అనే సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణా సహా వివిధ రాష్ట్రాల వాస్తవ ఆర్థిక పరిస్థితులను, ఆదాయా లను పరిశీలిస్తే రానున్న కాలంలో వాటి అమలు తలకు మించిన భారం కాగలదని ఆర్థిక, ప్రణాళికావేత్తలు అబిప్రాయపడుతున్నారు. కర్నాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు సిద్ధరామయ్య ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్న మాట వాస్తవం. ఇప్పటికే తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి పది కేజీల బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఎదు ర్కొంటోంది. కర్నాటక ప్రభుత్వం డబ్బు కడతాం అదనంగా బియ్యం ఇవ్వమని కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు నిరాకరించడంతో సేకరించిన మేరకు బియ్యం సరఫరా చేసి మిగతా ఐదు కేజీలకు సరిపడా మొత్తాన్ని కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. రాగులు, జొన్నలు ఎక్కువగా పండించే ప్రాంతాలలో ఐదు కేజీల రా గులు, లేదా జొన్నలు కొన్ని కుటుంబాలకు సరఫరా చేస్తు న్నారు. కర్నాటక వాసులుగా ఉన్న మహిళలకు ఆర్టీసి బస్సు లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం శ్రామిక మహిళలకు ఎంతో వూరట కలిగించింది. ఉచిత ప్ర యాణ సౌకర్యం వల్ల ఎక్కువగా మహిళలు ఆర్టీసి బస్సు లలో వెళ్తున్నందున ఆటోలకు, ప్రయివేటు వెహికల్స్‌కు గిరా కీ లేక దానిపై ఆధారపడ్డ కుటుంబాలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాయి. తమకు వెయ్యి కోట్ల పరిహారం చెల్లించా లని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటివే 6 గ్యారంటీలు, రాజస్థాన్‌లో 7 గ్యారంటీలు అ మలు చేస్తామని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆయా రాష్ట్రా ల పరిస్థితులను బట్టి కాంగ్రెస్ ఉచిత, సంక్షేమ పథకాలు ప్రకటించింది. తెలంగాణాలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలా రూ. 2,500 వారి ఖాతాలలో జమ చేస్తా మని, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ల ఇస్తామని, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని, తెలంగాణ ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని, ప్రతిఏటా రైతు భరోసా కింద ఏకరాకు రూ.15 వేలు, వ్యవ సాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని, వృద్ధులు, వితంతువులు, అనాథలకు నెలకు రూ.4వేల పింఛన్, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వైద్య సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రచారంతో జనం బాగా ఆకర్షితులు అవుతు న్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా తొలుత ఇవి ఆచరణ సాధ్యం కాదని కొట్టేసినా కాంగ్రెస్‌కు మహిళలు, పేదలు, నిరుద్యోగ యువతలో జనాదరణ పెరుగుతుం డటంతో వాటికి మరికొంత చేర్చి తాము కూడా అలాంటివే అమలు చేస్తామని ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతుభరోసా, రుణమాఫీ, గృహవసతి, తదితర ఉచితాలు, ఇతర సంక్షేమ పథకాలకు ఏటా రూ.68వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా. బీఆర్ఎస్ ప్రకటించిన కేసీఆర్ ఆరోగ్యబీమా, పింఛన్లు, తదితర ఉచితాల అమలుకు రూ. 52 వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రకటించిన నాలుగు ఉచిత సిలిండర్లు, విద్యార్థులకు లాప్‌టాప్‌లు, తీర్థ యాత్రలకు సాయం వంటి వాటికి ఏటా దాదాపు రూ.వేయి కోట్లు ఖర్చవుతుందని లెక్క.
…గెలిస్తే చందమామను భువికి దించుతామనేలా పార్టీలు అధికారం కోసం ఇలా ఎడాపెడా వాగ్దానాలు గుప్పించాయి. అయితే ఏవిధంగా చూసినా తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ.2 లక్షల కోట్లు దాటడం లేదు. అధి కారంలోకి వచ్చే పార్టీల వాగ్దానాలు అమలు చేస్తే వార్షిక బడ్జెట్ రూ.3,52,000కు పెరుగుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం రాబడి రూ. 2,56,958కోట్లు అని అంచనా. కాగా గత ఆగస్టు ఆఖరు వరకు సమకూరింది రూ.99,106కోట్లు మాత్రమే. అంటే కొంత రాబడితగ్గే సూచనలున్నాయి. కేంద్రం నిధులు ఆశించిన మేరకు రాకపోతే లోటు తప్పదు. 2023-24 బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా ఉంటుందని, రాబడి రూ. 2,59,861 కోట్లుగా ఉండగలదని అంచనా. అందువల్ల మరిన్ని వనరుల సమీకరణ అవసరమని తేలుతున్నది. తెలంగాణా ధనిక రాష్ట్రంగా అవతరించినా ఆర్థిక నిర్వహణ సరిగాలేక ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ఎత్తి పోతల పథకం, బరాజ్ పిల్లర్లు బీటలు వారడంతో టీఎంసీ ల నీటిని కిందికి వదిలేయడంతో నిరుపయోగంగా మిగి లింది. తదుపరి ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి, అవినీతి అక్రమాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపిం చాల్సి ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణను బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయాలంటే నిజాయితీ, చిత్త శుద్ది, అంకితభావంతో సమిష్టి కృషితో పాలన చేయగల సత్తా, దక్షత గల మేటి నాయకత్వం అవసరం.
– పతకమూరు దామోదర్ ప్రసాద్, 9440990381