నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి సహాయనిధితో పేద, మధ్యతరగతి ప్రజల వైద్యానికి ఎంతో భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వ ఈ ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేసిందన్నారు.ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో ఐదుగురు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.గ్రామానికి చెందిన చింతకుంట రవికి రూ.22వేలు, మామిడిపల్లి జ్యోతికి రూ.60వేలు, సాహిద్ తబస్సుంకు రూ.12వేలు, సాట బాజమ్మకు రూ.44వేల అర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది.అట్టి ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు కౌడ శైలేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, దూలూరి కిషన్ గౌడ్, సింగిరెడ్డి శేఖర్, పూజారి శేఖర్, పాలెపు చిన్న గంగారం, నల్ల సాయికుమార్, అజ్మత్ హుస్సేన్,అజారుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.