అలరించిన రామావత్ రష్మిక నాట్య ప్రదర్శన..

– అభినందించిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు
– అందరి చేత అభినందనలు పొందిన రశ్మిక
– నాట్య ప్రదర్శన లో ప్రత్యేకతను చాటుకున్న చిన్నారి
నవతెలంగాణ – పెద్దవూర
కృషి, పట్టుదల, తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే విద్యారంగంలో, కళారంగంలో కాక అన్నీ రంగాలలో  రాణించ వచ్చు అనుటకు నిదర్శనమే చిన్నారి రష్మిత. పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన డాక్టర్ రమావత్ శంకర్ నాయక్, విజయ కుమార్తె రశ్మిక విద్యారంగం లోనే  కాకుండా కళారంగం,హెచ్ఎంసీ డ్యాన్స్ స్టూడియో నృత్య రంగాలలో రానిస్తుంది చిన్నారి. దేవరకొండ పట్టణంలోని హెచ్ఎంసి డ్యాన్స్ స్టూడియో వేసవికాలంలో గత రెండు నెలలుగా చిన్నారులకు భరతనాట్యం కూచిపూడి ఫోక్ నృత్యాలలో తర్ఫీదు ఇచ్చారు. దేవరకొండ పట్టణంలోని ఎస్పిఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సెన్సీలో నిర్వహించిన ఈవెంట్లో రష్మిక అద్భుతమైన నృత్య ప్రదర్శనను ప్రదర్శించింది. ఈ సందర్భంగా పలువురు ఈ చిన్నారిని అభినందించి శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. రష్మిక చిన్నతనం నుండి అత్యద్భుతమైనటువంటి ప్రతిభ ను కనబరుస్తుందని తెలిపారు. డాన్స్ మాస్టర్ కొండలు మాట్లాడుతూ డాక్టర్ శంకర్ నాయక్ తమలాంటి కళాకా రులను ప్రోత్సహిస్తూ తమ కుమార్తె ను  ఇలాంటి కార్యక్రమాలు నేర్పించడం హర్ష నీయమని తెలిపారు. రష్మిక కు  మంచి భవిష్యత్తు ఉందని  చిన్నారి అన్నీ రంగాలలో అభివృద్ధి సాధించాలని అకాంక్షించారు.
Spread the love