ఎపిక్ షో ‘ఆగ్ ఔర్ పానీ కి టక్కర్’

కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం చెప్పేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా. అయితే ఇది మీకోసమే. ఇన్నాళ్లు ఎంతగానో అలరించిన పాత్రలు ఇప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ మెంట్ కు గురిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో చిన్నారుల ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అయినటువంటి POGO ఛానెల్ లో ఐకానికి పాత్రలైన లిటిల్ సింగమ్ మరియు చోటా భీమ్ ఇప్పుడు కలిసి మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీరిద్దరి కలయికలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆగ్ ఔర్ పానీ కి టక్కర్డిసెంబర్ 31, ఆదివారం నుంచి ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి భాషల్లో మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ప్రేక్షకులను వారి సీట్ల అంచున ఉంచే అద్భుతమైన సాహసానికి హామీ ఇస్తుంది.

Spread the love