మహిళల చైతన్యంతో మూఢనమ్మకాల నిర్మూలన: ఎస్సై పరశురాము

నవతెలంగాణ – మిరుదొడ్డి 
మహిళల చైతన్యంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమని ఎస్సై పరశురాము అన్నారు. సిద్దిపేట్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు మండల కేంద్రములోని కస్తూరిబా బాలికల విద్యాలయం నందు ఆదివారం మహిళల రక్షణ- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సై పరశురాము హాజరై మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు నమ్మడం దురదృష్టకరమని. స్త్రీ విద్యతో దేశ అభివృద్ధి సాధ్యమని విద్యార్థి దశలోనే మూఢనమ్మకాలు వీడుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని. దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా మోసం చేస్తున్నారని అన్నారు. సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ దయ్యాలు భూతాలు మంత్రాలు బూటకమని.  సైన్స్ ను సైనికుడిలా విద్యార్థులు ముందుకు నడవాలని. విద్యార్థి దశలోని ఉన్నత చదువులతో మీతల్లిదండ్రుల లక్ష్యాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. సైన్స్ మ్యాజిక్ షో నిర్వహించిన నరేష్ ఇనుప కత్తిని కడుపులో గుచ్చుకోవడం, విద్యార్థి చేతి పై కిరోసిన్ తో కాల్చడం, నోట్లో మంటలు లేపడం, గాలిలో విభూది సృష్టించడం, పేపర్లు కాల్చి చాక్లెట్లు చేయడం, విద్యార్థి వాచిని మాయం చేసి రింగు తీసి ఇవ్వడం, లాంటి అనేక ప్రదర్శనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  స్వర్ణలత, పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
Spread the love