మండల కేంద్రంలోని భీంగల్ చౌరస్తా వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాల్కొండ నియోజక వర్గానికి చెందిన ఈరవత్రి అనిల్ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున టపాకులు కాల్చి తమ నాయకుడు పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, నిస్వార్ధంగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వెతుక్కుంటూ అవే వస్తాయన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఈరవత్రి అనిల్ కు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భువనగిరి భాస్కర్, నాయకులు పూజారి శేఖర్, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఉట్నూరి ప్రదీప్, చింతకుంట శ్రీనివాస్, సుంకేట శ్రీనివాస్, వేములవాడ జగదీష్, సుంకరి విజయ్, బైండ్ల శ్రీనివాస్, సుంకరి రాజేశ్వర్, పలువురు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.