మాదకద్రవ్యాలు దుర్వినియోగంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

నవతెలంగాణ- రాయపోల్&దౌల్తాబాద్ 
మాదకద్రవ్యాలు దుర్వినియోగం, గంజాయి అక్రమ రవాణా వంటి అంశాలపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన కోసం వ్యాసరచన, డ్రాయింగ్ ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగిందని రాయపోలు ఎస్సై రఘుపతి బేగంపేట ఎస్సై భువనేశ్వర్ దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు. మంగళవారం బేగంపేట రాయపోల్ దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పై వ్యాసరచన, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం రాయపోల్, బేగంపేట, దౌల్తాబాద్  పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల  వలన కలిగే నష్టాలు  దాని నివారణ మార్గాలు పైన వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్,  ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు  ఎవరు కూడా బానిస కావద్దని చాలా ప్రమాదమని అవగాహన కల్పించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love