
సీఎం రేవంత్ రెడ్డి నిరుపేద ఆర్యవైశ్యుల పక్షాన నిలబడి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని యాదగిరిగుట్ట మండలం కాచారం ( కైలాస పురం) రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు. గురువారం స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల దశాబ్దాల కోరిక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పి సీ సీ అధికార ప్రతినిధి కాల్వ సుజాతకు అభినందనలు తెలుపుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ఆర్యవైశ్యుల పోరాటం మరువలేనిదని, ఆర్యవైశ్య కార్పొరేషన్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని ఆకాంక్షించారు.