అంబేద్కర్ జయంతి రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు…

నవతెలంగాణ – భీంగల్ రూరల్
ఈ రోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బడా భీంగల్ గ్రామం నందు గ్రామ ప్రజలతో కలిసి భీంగల్ ఎస్సై జి.మహేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఒకరికొకరు  శుభాకాంక్షలు తెలిపూకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రాసిన మహా మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్.  దేశానికి రాజ్యాంగం వెన్నుముక్క వంటిదని, రాజ్యాంగం రూపొందించడం వల్లే ప్రతి మనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, బ్రతికే హక్కును కల్పించింది, అంబేద్కర్ రాసిన ఆ సమిధన్ వల్లనే అని గుర్తు చేశారు.అక్కడ ఏర్పాటుచేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని, పోలీస్ స్టేషన్ సిబ్బంది తో కలిసి రక్త దాన శిబిరం నందు,రక్తదానం చేసినారు.ఇట్టి సందర్భంగా భీంగల్ ఎస్సై జి. మహేష్ గారు భీంగల్ మండల ప్రజలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134 వ జయంతి శుభాకాంక్షలు తెలిపినారు.
Spread the love