
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన గృహ జ్యోతి, లక్ష్మి పథకాల కోసం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు మార్చ్ నెల నాటికి జీరో బిల్ జనరేట్ కాకుంటే, అలాగే సిలిండర్ రిపేర్ తీసుకున్న వెంటనే 500 రూపాయల లబ్ధి రాకుంటే సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో తెలియజేశారు.