
గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి ధరఖాస్తు ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో డి ఎఫ్ ఓ సతీష్ కుమార్,జెడ్.పి. సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు తో కలసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.సూర్యాపేట పట్టణ పరిధిలో గల ఇందిరమ్మ మూడవ పేజ్ కాలనిలోని అలాగే కేసారం లో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులకు ఇల్లులను అప్పగించుటకు 10 టీమ్ లు ఏర్పాటు చేసి సత్వరమే సమస్య ని పరిష్కరించి లబ్ధిదారులకు త్వరగా ఇల్లులను అప్పగించాలని సూర్యాపేట ఆర్ డి ఓ వేణు మాధవ్ ని ఆదేచించారు. తదుపరి జూన్ 12 న పాఠశాలలు పునః ప్రారంభ సందర్బంగా పనులు పూర్తి అయిన అమ్మ ఆదర్శ పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యే గార్ల చే ప్రారంభించి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు వారిచే ఇప్పించవల్సిందిగా ఆర్డీఓ లను, డి.ఇ.ఓ కు, ఎం.పీ.డీ ఓ. లకు, యం.ఇ.ఓ.లకు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అధికారులు తప్పకుండ హాజరు కావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో ఎక్కువగా భూసమస్యలకు సబందించి 36, ఇతర శాఖలకు సంబంధించి 32 మొత్తం 68 దరఖాస్తులు అందాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవ్, డీఈవో అశోక్, డిపిఓ సురేష్ కుమార్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఎంహెచ్ ఓ కోటాచలం, డిటిడిఓ శంకర్, బి డబ్ల్యు ఓ వెంకట రమణ, ఏవో సుదర్శన్ రెడ్డి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.