ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి 

– ఉపాధ్యాయుడు యాకేందర్ ను అభినందించిన ఉపాధ్యాయ బృందం 
– నా సొంత రూ.పదివేల ఖర్చులతో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, ఇతర సామాగ్రి అందజేత
– మునిగలవీడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పెనుగొండ యాకేందర్
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని మునిగల వీడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉన్నంత స్థాయికి ఎదగడమే నా లక్ష్యం అని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పెనుగొండ యాకేందర్ తెలిపారు. గురువారం తన సొంత ఖర్చు రూ.10,000 విలువ గల పలకలు పుస్తకాలు రాత సామాగ్రిని విద్యార్థులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోయిని రవీందర్ చేతుల మీదుగా అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మండలంలోని మునిగల వీడు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉద్దేశంతో ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న పెనుగొండ యాకేందర్ ప్రతి సంవత్సరం తన సొంత ఖర్చులు పదివేల తో ప్రతి విద్యార్థి రాసుకోవడానికి చదువుకోవడానికి అన్ని విధాలుగా విద్యాపరంగా అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో, తాను ఎన్నో సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఈ పాఠశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందిస్తున్నాడని అన్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి పాఠ్యపుస్తకాల ఇతర మెటీరియల్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అతని పాఠశాల బృందం మరియు గ్రామస్తులు అతని అభినందించినట్లు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు గ్రామస్తులు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరినట్టు తెలిపారు. ఈ విధంగా గ్రామస్తులు సహకరిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఎంతో బలోపేతం చెంది అభివృద్ధి పథంలో దూసుకు పోతాయని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరిన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల బృందం రహిమతున్నీసా, రమేష్, వెంకటయ్య, వెంకటరమణ, మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love