ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు భాగ్య స్వాములు కావాలి: ప్రభుదాస్

నవతెలంగాణ – మిరుదొడ్డి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకు ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని మండల విద్యాధికారి ప్రభుదాస్ పేర్కొన్నారు. శుక్రవారం మిరుదొడ్డి మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఈనెల 3 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఎస్సై పరశురాములు, ఎస్సీ బీసీ వసతి గృహాలు సంరక్షణ అధికారులు రాజారాం, మండల పర్యవేక్షణ అధికారి నారాయణ, సిఆర్పిలు నర్సింలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love