గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: రేగ కేశవరావు

– సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– కాటాపూర్ పిహెచ్ సీ వైద్యాధికారి రంజిత్
– ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులను పంపించాలి: హెచ్ఎం రాజేష్
– గ్రామ సభలో వెల్లడి
నవతెలంగాణ – తాడ్వాయి
కాటాపూర్ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కాటాపూర్ ప్రత్యేక అధికారి రేగ కేశవరావు అన్నారు. శుక్రవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్యరాణి ఆధ్వర్యంలో కాటాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. మొదట పంచాయతీ కార్యదర్శి భాగ్యరాణి ఆదాయ, వ్యయాలు, అభివృద్ధికి ప్రణాళికలను చదివి వినిపించారు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ వచ్చే వానకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలందరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ప్రభుత్వ మెరుగైన వైద్యం పేద ప్రజలకు అండగా ఉందని, నిరంతరం అందుబాటులో ఉంటున్నామని, ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోరాదని తెలిపారు. కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ రాజేష్ మాట్లాడుతూ కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో ఉందని, కార్పొరేట్ విద్య సంస్థల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచిర్యాంకులు సంపాదించారని, అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు అడ్మిషన్ పొందాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, రెండు జతల ఏకరూప దుస్తులు(యూనిఫామ్), ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, టిఫిన్, భోజనం వసతులు కలవని తెలిపారు. ఈజీఎస్ ద్వారా పంట కాలువలను సరిగా నిర్వహించాలని గ్రామసభ ద్వారా రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, మాజీ సర్పంచులు పులి నరసయ్య గౌడ్, పుల్లూరి గౌరమ్మ, మేడిశెట్టి నరసింహయ్య, మాజీ వార్డ్ సభ్యుడు మేడిశెట్టి సమ్మయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ ఇందారం లాలయ్య, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ అరుణాకర్, వివిధ పార్టీల నాయకులు మేడిశెట్టి పురుషోత్తం, పులి రవి, మద్దూరు రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ, కారోబార్ యాకూబ్, అల్లె వెంకటేశ్వర్లు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, రంగు సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love