ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాలి 

Everyone should conserve water.– సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
అడుగంటి పోతున్న నీటిని సంరక్షించి భావితరాలకు అందించేల ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెహ్రు యువ కేంద్ర, సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నీటిని పొదుపు చేసేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని రాగుల మమతా యాదవ్ ,ఉపాధ్యాయురాలు కే అరుణ, జి అనిత, పి రాజమణి, బి కళావతి, ఎస్ నీరజ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love