
నవతెలంగాణ – భువనగిరి
అంగన్వాడి కేంద్రాలలోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని భువనగిరి సీడీపీవో శాగంటి శైలజా పేర్కొన్నారు. పోషణ మాసంలో భాగంగా భువనగిరి పట్టణంలోని నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథీగా హాజరై మాట్లాడారు. కేంద్రాలలో పోషకాహారాన్ని మహిళలకు, పిల్లలకు అందజేస్తూ పౌష్టికాహార లోపం లేకుండా చేస్తామని పేర్కొన్నారు.అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేష్ఠమని,ఆరు నెలలలోపు పిల్లలకు నీరు తాగించరాదన్నారు. గర్భిణులు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని దాని ద్వారా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు.ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు, చిరుధాన్యాలు గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలి. 0–5 సంవత్సరాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీలో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, గర్భిణులు బాలింతలు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధల మధ్యన గుడ్ప్రెడే వేడుకలు..
జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు శుక్రవారం గుడ్ ఫ్రై డే వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు భక్తులకు ఏసు సందేశాన్ని బోధించారు. ఈసందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ సమస్త మానవాళికి మంచి చేయాలనే తలంపుతో శిలువ అయిన త్యాగమూర్తి ఏసు పరలోక యాత్రను గుడ్ఫ్రై డేగా జరుపుకుంటారని పేర్కొన్నారు. శాంతి మార్గంలో అందరూ పయనించాలని సూచించారు.