ప్రతి ఒక్కరూ మహానీయుల అడుగుజాడల్లో నడవాలి..

Everyone should follow in the footsteps of the greats..– వారు చేసిన సేవలు దేశానికి ఆదర్శం..
– మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, ఖానాపూర్ బిఆర్ఎస్  నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్..
నవతెలంగాణ – జన్నారం
ప్రతి ఒక్కరూ మహానీయుల అడుగుజాడల్లో నడవాలని  వారు సమాజానికి చేసిన సేవలను గుర్తుంచుకోవాలని, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బిఆర్ఎస్ కానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి బుక్య జాన్సన్ నాయక్ అన్నారు. శనివారం జన్నారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ఎస్ బంకట్ హాల్లో తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత ఆధ్వర్యంలో నిర్వహించిన  మహనీయుల జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ముందుగా మండల కేంద్రంలోని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ నుంచి ఆర్ఆర్ యెస్, బంకట్ హాల్ వరకు డీజే సప్పులతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వాళ్ళు పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, బాబు జగ్జీవన్ రాం లు అణగారిన సమాజ అభివృద్ధి కోసం వారు శాయశక్తుల కృషి చేశారన్నారు . అలాంటి మహానీయులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం తప్పనిసరి అన్నారు. ముగ్గురు మహానీయుల, జయంతి ఉత్సవాలను మండల కేంద్రాల్లో, అందుకు కారణమైన సాయిని ప్రసాద్ నేతను అభినందిస్తున్నామన్నారు.
జాన్సన్ నాయక్ మంత్రి అవడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
బిఆర్ఎస్ కానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి, కేటీఆర్ క్లాస్మేట్ భూక్యా జాన్సన్ నాయక్, మంత్రి అవడం ఖాయమని, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జాన్సన్ నాయక్ ఎంతో కృషి చేస్తారన్నారు. అతని ఎమ్మెల్యే గెలిపించుకొని, ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మండలంలో ఉన్న నరసింహుల గుట్టల మధ్యలో పెద్ద చెక్ డాం నిర్మించి ఇక్కడి రైతుల  భూములను పంటలతొ  సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తారన్నారు. అంబేద్కర్ ఫూలే జడ్జీవన్ రామ్, ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ కుల సంఘాల నాయకులు, టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు, గుర్రం రాజారామ్ రెడ్డి సులువ జనార్ధన్, అంబేద్కర్ మండలాధ్యక్షుడు భరత్ కుమార్, బీసీ సంఘాల నాయకులు కే ఏ నర్సింలు లక్ష్మీనారాయణ, ఓల్లాల నరస గౌడ్, తాళ్లపల్లి రాజేశ్వర్, కె. ప్రభుదాస్,  సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు జాడి గంగాధర్ జన్నారం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొండయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యులు మూనవరాలి ఖాన్ ఫజల్ ఖాన్, మాజీ ఎంపీపీ సత్యం, బోర్లకుంట ప్రభుదాస్ జునుగురి మల్లయ్య జాడి భూమేష్, రాజేశ్వర్, ప్రకాష్ నాయక్, అల్లూరి వినోద్, దుర్గం వినోద్, దుర్గం వసంత్ జాడి వెంకటయ్య, దత్తు ప్రేమ్ కుమార్ వివిధ కుల సంఘాల నాయకులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love