బాన్సువాడ ఎక్సైజ్ శాఖలో అంతా గోప్యమే

– కల్తీకల్లు దారులకు మద్దతు ?
– కేసు నిర్వీర్యం చేసేందుకు పైరవీలు బాన్సువాడలో హడావుడి చేస్తున్న ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ-బాన్సువాడ (నసురుల్లాబాద్) :
కామారెడ్డి జిల్లాలోనే సంచలం సృష్టించిన కల్తీకల్లు కేసును నిర్వీర్యం చేసేందుకై పైరవీలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. బాన్సువాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అంతా గోప్యంగా పనులు సాగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు.  గత మూడు రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడ ఎక్సైజ్ శాఖ అధికారులు బీర్కూర్ నా సురుల్లాబాద్ మండలాల్లో హడావుడి చేస్తూన వైనం, నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ఓ కల్లు డిపో నుంచి సరఫరా అయినా కల్తీకల్లుతో 65 మంది అస్వస్థతకు కారకులైన వారిని రక్షించేందుకై ఎక్సైజ్‌ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారాలు పైరవీడు చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం మంగళవారం గత రెండు రోజులుగా కల్తీకల్లుకి  గురై ఆసుపత్రికి పాలవుతున్నారు. సోమవారం 35 మంది ఆసుపత్రిలో చేరగా మంగళవారం మరో 30 మందికి పైగా కల్తీ కల్లుకు గురై ఆస్పత్రి పాలయ్యారు ఇందులో కొందరి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి హైదరాబాద్ కు  తరలించారు. నాలుగు గ్రామాల బాధితులను వైద్య అధికారులను, అధికారులను, రెవెన్యూ శాఖను, పోలీస్ శాఖను,  ఎక్సైజ్ శాఖ అధికారులను పరుగులు పెట్టించిన కల్తీకల్లు వ్యవహారం చివరకు కొండను తవ్వి ఎలకను పట్టినట్లు ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 18 మందిపై కేసులు నమోదు చేసి దుర్కీ కళ్ళు దుకాణం సీజ్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. కల్తీకల్లు విక్రయించి ఎందరో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ముస్తేదారులపై ఏలాంటి చర్యలు తీసుకున్నారో తెలపడం లేదు. వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు పరిగతం చేయడం లేదు. కొందరిని అదుపులో తీసుకొని రెండు రోజులు గడుస్తున్న ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో  ఉన్నత అధికారులు చెప్పకపోవడంపై బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో అంతా గోప్యంతగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. కల్తీకల్లు కు సంబంధం ఉన్న కొందరు హైదరాబాదులో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాదులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడి ద్వారా ఎక్సెస్ శాఖలో ఉన్న ఓ అధికారి చేత పైరవెల్లి సాగుతున్నట్లు సమాచారం. కేసును నిర్వీర్యం చేసేందుకు పన్నాగాలు సాగుతున్నట్లు సమాచారం. కల్తీకల్లు లో కేసులో సెక్షన్లు తగ్గించి కేసు చేస్తున్నట్లు సమాచారం. వడ్డించేటోడు మనోడు అయితే ఏ మూలకు కూర్చున్న వస్తుందని సామెతకు నిదర్శనంగా కల్తీకల్లుదారులకు ఎక్సైజ్ శాఖ లో పనిచేస్తున్న కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కల్తీకలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ కల్లుకు కేరాఫ్ గా నిలిచిన నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామాల్లో ఉన్న ముస్తేదారులపై ఇలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ ఏ సెక్షన్ పెట్టి కేసు నమోదు చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love