గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: ఎక్సైజ్ సీఐ వేణుమాధవ్

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ ఎక్సైజ్ పరిధిలోని   సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, భీంగల్ మండలాలలో గంజాయి నాటసార నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ వేణుమాధవ్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయిని అరికట్టేందుకు ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో  ప్రతిరోజు రోడ్ వాచ్ నిర్వహిస్తూ నిఘాను పటిష్టం చేశామని, ఇందుకోసం టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేశామని కనుక గంజాయి  పై ఇలాంటి సమాచారము ఉన్నను 87126 58976 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఏ తెలియజేశారు. అలా సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
Spread the love