నవతెలంగాణ – పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్ – 2 పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ కు వాయిదా వెయ్యడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగవలసిన ఈ పరీక్షకు నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే సమయం తక్కువగా ఉండటంతో శుక్రవారం ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయినందున ఈ పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. గ్రూప్ -2 లో 783 ఉద్యోగాలకు గాను 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అన్నారు. అదే విధంగా పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.