– ఏడీ హేమంత్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధికి చదువుతో పాటు చదివిన విషయాన్ని వ్యక్తం చేయడం అవసరం అని,భావవ్యక్తీకరణ నైపుణ్యం విజయానికి సోపానం అని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్ అన్నారు. వ్యవసాయ మహిళా విద్యార్ధులకు గోద్రెజ్ ఆగ్రో వెట్,పసిడి పంట ఫౌండేషన్ ఆద్వర్యంలో “ఇక్క” లెర్నింగ్ ఫౌండేషన్ సౌజన్యంతో రెండు రోజులు పాటు కెరీర్ ఓరియంటల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సోమవారం కార్యక్రమాన్ని హేమంత్ కుమార్ ప్రారంభించి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం “ఇక్క” లెర్నింగ్ ఫౌండేషన్ కన్సల్టెంట్ ట్రైనీ లు బి.వెంకటరమణ,బి.ప్రవళిక,కో – ఆర్డినేటర్ పి.సురేష్ లు విద్యార్ధులకు స్వీయ పరిచయం,వ్యక్తిగత సమాచారం రూపొందించడం,సమూహ చర్చలు,ఇంటర్వ్యూలు కు సిద్దమవడం,లక్ష్యాలు నిర్దేశం,యోగ్యత పరీక్ష లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది ప్రొఫెసర్స్ రమేష్,టి.శ్రావణ్,టి.క్రిష్ణ తేజ్ లు పాల్గొన్నారు.