– బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ
నవతెలంగాణ – మిరు దొడ్డి
అక్బర్ పేట- భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామాన్ని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం సందర్శించారు. గ్రామంలోని పెద్ద చెరువు పై తలెత్తిన వివాదంలో ముదిరాజ్ కులస్తులను గ్రామస్తులు బహిష్కరించడం సరైంది కాదన్నారు. పెద్ద చెరువులోని చేపలను గ్రామ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చేపలను విక్రయించి గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుందన్నారు. ముదిరాజ్ కులస్తులకు మాత్రమే చేపలను అమ్ముకునే హక్కు ఉంటదని గ్రామస్తులతో ముదిరాజ్ కులస్తులు వాదించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ముదిరాజ్ కులస్తుల బహిష్కరణను ఉపసంహరించుకోవాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ, తహాసిల్దార్ జయంత్, స్పెషల్ ఆఫీసర్ వీరేష్, ఎంపీడీవో గణేష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.