నవతెలంగాణ – హైదరాబాద్ : ల్యాబ్‌లో డైమాండ్ జ్యువెలరీని ఉత్పత్తి చేసే అవిరా డైమండ్స్ తాజాగా తన కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించింది. నగరంలో మొదటి ఎక్స్‌క్లూజివ్ బుటిక్ స్టోర్‌ను మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్‌ను శనివారం ఆ సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ సురేష్ జైన్ లాంచనంగా ప్రారంభించారు. ఇది తమకు ఎనిమిదో స్టోర్ అన్నారు. చెన్నరు, బెంగళూరు, పుదుచ్చేరి, దుబారులో కార్యకలాపాలను కలిగి ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ ఫ్రాంచేజీ భాగస్వాములు శిల్పారెడ్డి కొల్లా, కొల్లా అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.