మసీదుల వద్ద సౌకర్యాలను కల్పించాలి..

– మున్సిపల్ ఛైర్ పర్సన్, కమిషనర్ కు కోరిన పట్టణ ముస్లిం కమిటీ
నవతెలంగాణ – వేములవాడ
ఈనెల 12 నుండి ప్రారంభమయ్యే   పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ పరిధిలోని అన్ని మసీదుల వద్ద  తగు సౌకర్యాలను కల్పించాలని పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రం ఆధ్వర్యంలో సోమవారం  మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. మున్సిపల్ పరిధిలోని అన్ని మసీదుల వద్ద చలువ పందిళ్ళు,హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, రంజాన్ మాసంలో  24 గంటలు నీటి సరఫరాచేయాలని, కోతలు లేకుండా విద్యుత్తు , ముస్లిం స్మశానవాటికలో,ఈద్గాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన చైర్ పర్సన్, కమిషనర్  పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మున్సిపల్ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని పట్టణ ముస్లిం కమిటీ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహ్మద్ అక్రం,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు బాబున్,ముస్లిం కమిటీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ వలి, మాజీ అధ్యక్షులు అంజద్ పాషా,మసీద్ అధ్యక్షులు షేక్ ఇమామ్, సర్వర్ పాష,అబ్దుల్ రజాక్, మహమ్మద్ బషీర్, అబ్దుల్ రఫీక్,ముస్లిం నాయకులు షేక్ యూసుఫ్, రహీం, కమిటీ సభ్యులు మతపెద్దలు  పాల్గొన్నారు.
Spread the love