ఈద్గాలలో సౌకర్యాలు కల్పించాలి…

Facilities should be provided in Idgas.నవతెలంగాణ – ఆర్మూర్
రాబోయే రంజా న్ సందర్భంగా పట్టణం పాటు పెర్కిట్, మామిడిపల్లి ఈద్గాలలో మొరం, టెంటు, నీటి సౌకర్యం కల్పించాలని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజు కు వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా మర్కాజ్ కమిటీ అధ్యక్షులు ముహినుద్దీన్ మాట్లాడుతూ పట్టణంలోని పలు ఈద్గాలను శుభ్రం చేయించి పిచ్చి మొక్కలు తొలగించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో మర్కాజ్ కమిటీ ఉపాధ్యక్షులు అతిక్, సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, జాయింట్ సెక్రెటరీ రిజ్వాన్, సాజిద్ భాయ్, కజిన్ , ముఖిమ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love