ప్రయివేటు కొలువుల జాతర

Fair of private measures– నేడు వేములవాడలో మెగా జాబ్ మేళా
– నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
– డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజన్న సిరిసిల్ల ఆద్వర్యంలో  నిర్వహణ
– యువత సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ కొలువుల ప్రక్రియ కొనసాగిస్తున్న రాష్ట్ర సర్కార్ యువతకు వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అందించే కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టనున్నది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజన్న సిరిసిల్ల ఆద్వర్యంలో 50 కంపెనీలతో  జాబ్ మేళా  నిర్వహించనున్నది.
ఉదయం 10 గంటలకు మొదలు..
ప్రైవేటు కంపెనీల్లో యువతకు కొలువులు ఇప్పించేందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ మేళాలు చేపడుతున్నది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచనల మేరకు రాజన్న సిరిసిల్ల ఉపాధి కల్పనా శా ఆద్వర్యంలో ఆదివారం వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్ లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.
50 కంపెనీలు.. 5000 ఉద్యోగాలు..!
ఈ జాబ్ మేళాలో 50 కంపెనీలు.. 5000 ఉద్యోగాలు ఆయా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫోసిస్, విప్రోలాంటి సాఫ్ట్వేర్ కంపెనీల అనుబంధ సంస్థలు, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, కన్స్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మార్కెటింగ్, ఆటో మొబైల్స్, సేల్స్, మేనేజ్ మెంట్, సెక్యూరిటీ, ఎంఎన్ సీ లకు చెందిన దాదాపు 50 కంపెనీలు, కరీంనగర్, సిరిసిల్ల ఇతర ప్రాంతాలకు చెందిన పాల్గొంటున్నాయి. ఇందులో అపోలో ఫార్మసీ, శుభ గృహ, అనుభ సాఫ్ట్, వరుణ్ మోటార్స్, రానే బ్రేక్ లైనర్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, ఐటీసి ఫుడ్స్ తదితర సంస్థలు మేళాకు హాజరు కానున్నాయి.
ఇవీ అర్హతలు..
పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన అభ్యర్థులు మేళాలో పాల్గొనవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉండడమే కాకుండా ఉన్నత స్థానాలకు ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అర్హత.. చదువు, అనుభవం బట్టి అభ్యర్థులకు నెలకు రూపాయలు 12 వేల  నుండి 40 వేల రూపాయల వరకు వేతనం ఉంటుందని పలు సంస్థల బాధ్యులు తెలిపారు. మరిన్ని వివరాలకు  99633 57250, 98853 46768.  ఫోన్ నెంబర్ లకు సంప్రదించాలి.
యువత సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు వేములవాడలో నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఖాళీల భర్తికీ నోటిఫికేషన్లు జారీ చేస్తూ కొలువు భర్తీ ప్రక్రియను కొనసాగిస్తుంది. అలాగే ప్రైవేటు సంస్థల్లో యువతకు అవకాశాలు అందించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తు న్నాము. ఏదైనా కొలువు సాధించి, తమ లక్ష్యాన్ని చేరుకోవాలి.
యువతకు మంచి అవకాశం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఈ నెల 25వ తేదీన మెగా జాబ్ మేళా యువతకు మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పని అనుభవం, పోటీ పరిస్థితులు అంచనా వేస్తూ ముందకు వెళ్లాలి. మార్పులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ కెరీర్ కొనసాగించాలి.

Spread the love