– తెలంగాణ ఆయిల్ ఫాం రైతు సంఘం ఆద్వర్యంలో ధర్నా…
– డిమాండ్స్ పత్రాన్ని డీవో రాధాక్రిష్ణ కు అందజేత.
– హాజరైన తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఫాం ఆయిల్ రైతు సంఘం – హైద్రాబాద్ ఆద్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం,నారంవారిగూడెం లోని ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట జోన్ పరిధిలో రీఫైనరీ పరిశ్రమ స్థాపించాలని, అశ్వారావుపేట లో ఐఐఓపీఆర్ పరిశోధనా స్థానం ఏర్పాటు చేయాలని, ఆయిల్ ఫాం బోర్డ్ ఏర్పాటు చేయాలని,వంద్యత్వ (ఆఫ్ టైప్) మొక్కలు వేసిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే నాలుగు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని డివిజనల్ ఆఫీసర్ నాయుడు రాధాక్రిష్ణ కు అందజేసారు. తర్వాత తెలంగాణ ఆయిల్ ఫాం రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అద్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ మాట్లాడుతూ ఫాం ఆయిల్ బోర్డ్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిన భాద్యత స్థానికుడు ఐనా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కే ఎక్కవుగా ఉందని అన్నారు.బడ్జెట్ లో ఆయిల్ ఫాం కు నిధులు కేటాయించి సాగు విస్తరించి రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి అని అన్నారు.సంఘం జిల్లా అద్యక్షులు యలమంచిలి వంశీక్రిష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోనే పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి ఆయిల్ ఫాం కు సోకే చీడపీడలు నివారించి,మెరుగైన దిగుబడులు వచ్చేలా ఆయిల్ ఫెడ్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
బయోమాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.తుంబూరు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆఫ్ టైప్ మొక్కలు తో నష్టపోయిన రైతుల పక్షాన పోరాడే నాయకులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్రోకర్ లు వ్యాఖ్యానించడం బాధాకరం అని,ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడంతో పాటు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కారం శ్రీరాములు,తలశిల ప్రసాద్,సోడెం ప్రసాద్,మోరంపుడి శ్రీనివాసరావు,ముదిగొండ రాంబాబు,కొండ బోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం యదాతధం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ తోటలు విస్తరించు చున్నవి. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా ఆయిల్ ఫాం తోటలు వేసిన రైతులు 24 వేల మం అశ్వారావుపేట,అప్పారావుపేట ఫ్యాక్టరీల పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫెడ్ రైతుల ద్వారా వస్తున్న రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల గెలల నుండి దాదాపుగా అరవై వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అవుతున్నది.రామన్న కొద్ది కాలంలో ఇంకా అయిల్ఫాం తోటలు పెరిగి, భారీగా గెలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. దీనివలన ఆయిల్ టన్నుల కొద్దీ ఉత్పత్తి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది. అందువలన ఈ రెండు ఫ్యాక్టరీల పరిధిలో రిఫైనరీ(నూనె శుద్ధి) యూనిట్ ఏర్పాటు చెయ్యాలి. ఐఐఓపీఆర్ ద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చెయ్యాలి.2018 – 2020 మధ్యలో అయిల్ఫైడ్ ద్వారా ఇచ్చిన మొక్కలు ఆన్లైప్ (గెలలు దాని మొక్కలు) 5 సం॥ నుండి 8 సంవత్సరాల వయస్సు కలిగిన మొక్కలు గెలలు రాక ఇబ్బందులు పడుతున్న బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుచున్నాము. తెలంగాణ రాష్ట్రంలో అయిల్పామ్ బోర్డు ఏర్పాటు చేసి రైతులకు వస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి. ఆయిల్ ఫెడ్ కో – ఆపరేటివ్ ఫెడరేషన్ కాబట్టి ఇందులో భాగస్వాములైన రైతులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి. రైతుల భాగస్వామ్యంలో 75.25% వాటా కలిగిన రైతులకు ఎప్పటికప్పుడు కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయినా మహాజన సభ ద్వారా ఆదాయ వ్యయాలు పారదర్శకంగా వివరించాలని డిమాండ్ చేస్తున్నాము.