నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని బ్యాంకులు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తున్నట్లు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన మొలంగూర్ ఇండియన్ బ్యాంకు లో రైతులకు రుణమాఫీ కాలేదని శుక్రవారం బ్యాంకు మేనేజర్ ను రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మండలంలోని వివిధ బ్యాంకులలో అర్హులైన రైతుల రుణమాఫీ లిస్టు అంటించారు. ఇండియన్ బ్యాంకులో మాత్రం మేనేజర్ తప్పిదం వల్లనే రైతులకు రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు రుణమాఫీ చేయకుంటే ధర్నా చేపడతామని డిమాండ్ చేశారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు సెకండ్ లిస్టులో రుణమాఫీ లిస్టు పంపిస్తామన్నారు. రైతులు అంతటితో ఆగక జిల్లా కలెకటర్ కు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు.