రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి..

– సూర్యాపేట జిల్లాలో 3,970 ఎకరాలలో సాగు చేసిన రైతులు..
– మూడేళ్లపాటు ఇతర పంటలకు అనుకూలం..
– నాలుగో యాట నుంచి ఖాతా దిగబడి..
– జిల్లాలో 10,500 ఎకరాలలో లక్ష్యంగా ఉద్యాన శాఖ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సంప్రదాయ పంటలతో కుస్తీ పడుతున్న రైతులు సేద్యంలో నూతన అధ్యయానికి శ్రీకారం చుడుతున్నారు.అధిక లాభాలు పొందెందుకు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు.తొలిసారిగా ఆయిల్ పామ్ సాగు చేసిన నేపథ్యంలో పంట సాగుకు విధానం అనుసరించాల్సిన పద్దతులపై రైతులకు జిల్లా ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో రైతులకు ఆర్థికంగా అండగా ఉండేలా వాణిజ్య పంటను ఉద్యాన శాఖ పరిచయం చేసింది.ఏడాది క్రితం నాటిన మొక్కలు ఎదుగుతున్నాయి.గతంలో భూగర్భ జలాలు పెరగడంతో వరి సాగు విస్తీర్ణం పై రైతులు ముగ్గురు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపో వాల్సి వస్తోంది.దీంతో రైతులకు ఉపాధిబాటను చూపేందుకు జిల్లా అధికారులు 2023 లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేసింది.ఆసక్తి గల రైతులకు ఆ పంటసాగుపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంటపై సబ్సిడీ..
జిల్లాలో 10,500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో 21-22 లో 566 ఎకరాలు, 22-23 లో 1760 ఎకరాలు, 23-24లో 1644 ఎకరాలలో ఇప్పటివరకు మొత్తం 3,970 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును రైతులు చేశారు.కేంద్రం అందజే స్తున్న సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది.ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం 60 శాతం,రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయి.అయిల్ ఫామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏళ్ల పాటు నిరంతరం ఆదా యాన్ని పొందవచ్చు. మొదటి మూడు సంవత్సరాల మొక్కల మధ్యలో ఇతర పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.ఈ పంటతో పాటు ఇతర పంటలు వేయడంతో రైతులకు ఎంతో లాభదాయకంగా మారుతుంది.
మొక్కలకు అనుకూలమైన నేలలు..
ఆయిల్ ఫామ్ సాగుకు ఇక్కడ నేలలు అనుకూలంగా ఉన్నాయి.దేశంలో వంట నూనె వినియోగం ఎక్కువ గా ఉంటుంది.ఇందుకు గాను విదేశాల నుంచి పామాయిల్ గింజలను దిగు మతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించేలా రాష్ట్రం చర్యలు తీసుకుంటోంది.ఈ పంట ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా దేశాలలో ఆర్థికా ఆభివృద్ధి సాధించాయి.రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది.
వంద శాతం రాయితీపై డ్రిప్ లు అందిస్తోంది.
ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ,ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను వంద శాతం సబ్సిడీపై ఇస్తున్నారు.బీసీ రైతులకు 90 శాతం,ఇతర రైతులకు 80 శాతం రాయితీపై సాగు నీటి పారు దల పరికరాలు ఇస్తున్నారు. ఇందులో ఐదు హెక్టార్ల వరకు దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇలా అయిల్ పామ్ సాగు చేసే రైతులకు 125 ఎకరాల వరకు డ్రిప్ కనెక్షన్ పరికరాలు రాయితీ ఇస్తున్నారు..
ఆయిల్ ఫామ్ యొక్క ప్రయోజనాలు..
ఎకరా వరిసాగుకు వినియోగించే నీటితో మూడెకరాల అయిల్ ఫామ్ సాగు చేయొచ్చు. మూడేళ్లపాటు అరటి,మిరప,సోయాబీన్,పసుపు, కూరగాయలు,పూలు,నువ్వులు,వేరుశనగ,పొద్దు తిరుగుడును అంతర పంటలుగా సాగు చేయొచ్చు.ఒక టన్ను గింజల ధర రూ.19వేలు ఉంటుంది,ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటపై ప్రకృతి వైపరీత్యాల బెడద ఉండదు రైతులకు ప్రతీ ఏడాది నికర ఆదాయం 30 సంవత్సరాల పాటు పంట దిగుబడి ఉంటుంది.వరి పంటతో పోల్చితే ఈ పంట వేయడం వల్ల శ్రమ తక్కువగా ఉంటుంది లాభాలు అధికంగా ఉంటాయి.
రైతులకు ఈ పంటతో లాభదాయకమే..
జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి నాగయ్య.
ఆయిల్ ఫామ్ సాగు చేయడం వలన రైతులకు లాభదాయకం గా ఉంటుంది. ప్రభుత్వం మొక్కలు, డ్రిప్ పై సబ్సిడీలు ఇస్తాంది.నాగుగేళ్ల పాటు ఎకరాకు రూ.4,200 చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.ఈ పంటకు కోతులు,పందులు,పక్షుల బెడద ఉండదు.అలాగే ప్రకృతి విపత్తులతో నష్టం కలగదు.మొక్కలు నాటిన ఐదో సంవత్సరం నుంచి గెలలు వేస్తాయి.అప్పటి నుంచి ఎకరానికి ఏటా రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.రైతులకు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఉంటుంది.
Spread the love