ఆదాయం పైన ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు

– టార్గెట్ ను మించి ఆదాయం
– లాభాల బాటలో మార్కెట్ యార్డులు
– రైతులకు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు
నవతెలంగాణ – అచ్చంపేట 
జిల్లాలో నాగర్ కర్నూల్,  కొల్లాపూర్ ,కల్వకుర్తి , అచ్చంపేట నాలుగు నియోజకవర్గాలలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఆయా వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు పండించిన పంటలను మార్కెట్లో కమిషన్ ఏజెంట్లకు విక్రయిస్తుంటారు. వచ్చిన ఆదాయంలో  కొంత ఆదాయాన్ని రైతుల సౌకర్యాలు, వసతుల కోసం ఖర్చు చేయవలసిన మార్కెట్ యార్డ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులలో కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరు నెలలు పాటు కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ కు వస్తే అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ ఏజెంట్లు సిండికేట్ గా మారి పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా దోపిడీ చేస్తున్నారని రైతులు బహిర్గతంగా రోడ్ ఎక్కిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఫిబ్రవరి మార్చ్ నెలలో వేరుశెనగ పంటను కొనుగోలు చేయడంలో గిట్టుబాటు ధర కల్పించడంలో వ్యాపారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. రైతులు స్వచ్ఛందంగా అంబేద్కర్ చౌరస్తాలో పల్లి పంటను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట అమ్మక్కోవడానికి వచ్చిన రైతులు 2, 3  రోజులు మార్కెట్ లోనే ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. విశ్రాంతి గదులు లేవు సౌకర్యం అంతంత మాత్రం గానే కల్పించి చేతులు దులుపుకుంటున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో విశ్రాంతిభవనం మూతపడింది. రైతులు చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏడాదిలో ఆరు నెలలకు ఒకసారి రైతులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి అదేవిధంగా పశువుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉన్నప్పటికీ మార్కెట్ యార్డ్ అధికారులు అమలు చేయడం లేదు. ఆదాయం పైన ఉన్న శ్రద్ధ రైతులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా అద్వానంగా పారిశుధ లోపించి కనిపిస్తున్నాయి. నీటి సౌకర్యం కోసం కఠిన ట్యాంకులను కనీసం 6 నెలలకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు.  వ్యవసాయ మార్కెట్ యార్డులు ప్రతి ఏడాది ఎంచుకున్న టార్గెట్ ను మించి లాభాలు గడిస్తున్నాయి. జిల్లాలోని నాలుగు మార్కెట్ యార్డులు  రెండేళ్లుగా ఆర్థిక  టార్గెట్ ను నుంచి ఆదాయం వస్తుంది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వివరాలు  ఈ విధంగా ఉన్నాయి. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ టార్గెట్ రూ.5 కోట్ల 77 లక్షలు -వచ్చిన ఆదాయం 8 కోట్ల 40 లక్షల 24000వేలు,
 అచ్చంపేట మార్కెట్ యార్డ్ టార్గెట్ రూ 2 కోట్ల 82 లక్షలు- వచ్చిన ఆదాయం రూ.2 కోట్ల 89 లక్షల 49000 వేలు, కల్వకుర్తి రూ .5.కోట్ల 65 లక్షలు- వచ్చిన ఆదాయం రూ.6 కోట్ల 65 లక్షల 48000 వేలు, కొల్లాపూర్ రూ.2 కోట్ల 48 లక్షలు వచ్చిన ఆదాయం రూ.5 కోట్ల 23 లక్షల 57,000 వేలు ఆదాయం వచ్చింది. 4 మార్కెట్ యార్డులు 2023 -24 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ఆదాయం 16 కోట్ల 72 లక్షలు కాగా వచ్చిన ఆదాయం 23 కోట్ల 18 లక్షల 74000. మొత్తం పైన మార్కెట్ యార్డులు లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ రైతులకు కనీస సౌకర్యాలు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించి ప్రతి మార్కెట్ యార్డులో రైతుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతిభవనం ఏర్పాటు చేయాలని అందుబాటులో త్రాగునీరు ఉంచాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. .విశ్రాంతి భవనం, త్రాగునీరు వసతి కల్పించాలి: బక్కయ్య రైతు రాయచెడి గ్రామం
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి భవనం సౌకర్యం కల్పించాలి. పంటకు కనీస గిట్టు పడదర అమలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. రోజుల తరబడి ఎదురు చూడకుండా మార్కెట్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. మధ్యాహ్నం భోజనం అమలు చేయాలి. సిండికేట్ గా మారుతున్న కమిషన్ ఏజెంట్ల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యాపారులు కమిషన్ తగ్గించుకోవాలి: బాల్ రెడ్డి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మార్కెట్ యార్డులలో కమిషన్ ఏజెంట్లు తమ కమిషన్ తగ్గించుకోవాలి. ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న టార్గెట్ కు మించి ఆదాయ వనరులు వస్తున్నాయి. ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ రైతుల వసతుల పైన చూపడం లేదు.
Spread the love