అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి: వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – మహదేవపూర్

అకాల వర్షాలు వచ్చే అవకాశం  ఉన్నందున ధాన్యం తడవకుండా కల్లాలు ఎతైన  ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. బుధవారం  మహాముత్తారం మండలంలోని మినాజిపేట, రేగులగూడెం ధాన్యం కొనుగోలు  కేంద్రాలను తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం రాసులు తడవకుండా టార్ఫాలిన్‌లు కప్పాలని రైతులకు అవగాహన కల్పించారు. ధాన్యం  కేంద్రానికి అనువైన ఎగువ ప్రాంత భూమిని గుర్తించాలని కొనుగోలు కేంద్రాల ఇంఛార్జిలను ఆదేషించారు. అకాలంగా  కురుస్తున్న వర్షాల కారణంగా వరి పొలాల్లోకి నీరు చేరుతోందని తడవకుండా తగు సంరక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం సకాలంలో రవాణా చేసేందుకు  అవసరమైన సంఖ్యలో వాహనాలను సమకూర్చు కోవాలని అన్నారు. ఓ పి ఎం.ఎస్ ప్రకారం  తక్షణమే రవాణా మరియు మిల్లర్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా దిగుమతి చేసేందుకు హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు.

Spread the love