రైతులు గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – రాయపర్తి
వరి ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో, మైలారం, సన్నూరు, మహబూబ్ నగర్ తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పేర్కొన్నారు. క్వింటాకు కనీస మద్దతు ధర ఏ రకం రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని శుభ్రం చేసి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా చూడాలన్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత రైతులు రశీదు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు టోకెన్ ప్రకారం కాంటాలు పెట్టాలని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, ఏపీఎం అశోక్, సిసిలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love