పెద్దవూర లో దేశవ్యాప్త కార్మికుల కర్షకుల సమ్మె విజయవంతం

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లో దేశవ్యాప్త కార్మికుల, కర్షకుల సమ్మె విజయ వంతం అయింది. ఈ సందర్బంగా నాగార్జునసాగర్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై కార్మికలోకం సిఐటియు ఆధ్వర్యంలో పిఎన్ఎం జిల్లా సహాయ కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య  అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండ్రెడ్డి నాగిరెడ్డిసి ఐ టీ యు జిల్లా నాయకులు ఎస్ కే భషీర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన రైతాంగ కార్మిక కర్చకుల వ్యతిరేక విధానాలకు చట్టాలను తీసుకొచ్చి రైతులు కార్మికుల నడ్డి విరిచారని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి నేడు ఉద్యోగ కల్పన లేదని విమర్శలు చేశారు.నిరుద్యోగం గత 50 సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని అన్నారు.వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100 శాతం వాటాలను తెగ నమ్ముతున్నదని,ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్ పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నదని తెలిపారు.సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు సిద్ధం అయిందని,ప్రజా వ్యతిరేక విధానాల చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ప్రజా పోరాటాల తోటి ప్రతిఘటిస్తామని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చింది కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందని సమ్మెహకులను కాలరాస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే ప్రజా పోరాటాలతో  కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు  మంగారెడ్డి డివైఎఫ్ఐ మండల కన్వీనర్ తరి రామకృష్ణ కెవిపిఎస్ జిల్లా నాయకులు దోరేపల్లి మల్లయ్య, లచ్చిరెడ్డి, వూరే ప్రభాకర్,ఎలక్ట్రిషన్  మండల నాయకులు దేశ నాయక్,జిపి మండల నాయకు రాలు వూర యాదమ్మ,సైదమ్మ,పాపమ్మ,
తదితరులు పాల్గొన్నారు
Spread the love