నవతెలంగాణ – గోవిందరావుపేట
వడగండ్ల వానతో మండల వ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.50వేల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలం లోని వివిధ గ్రామాలలో వడగండ్ల వానతో ఈదురు గాలులతో దెబ్బతిన్న ఇళ్లను పంట పొలాలను సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల వెంకట్ రెడ్డి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మాట్లాడుతూ నిన్న పడిన వడగండ్ల వానకు వందలాది ఎకరాలలో పంట పూర్తిగా దెబ్బతిన్నదని కోతకొచ్చిన పొలాలు ఎకరాకు పెట్టుబడి 30 నుండి 40 వేలు పెట్టుబడి పెట్టి తీరా కోసే టైంలో వడగళ్ల వాన రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు అంతే కాకుండా పెద్ద ఎత్తున వచ్చిన ఈదురుగాలులతో అనేక ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని మండలంలో మామిడి తోటలు 100% దెబ్బతిన్నాయని పేర్కొన్నారు వరి పంటకు ఎకరాకు 50,000, మామిడి తోటకు ఎకరాకు 50,000, పూర్తిగా దెబ్బ తిన్న ఇండ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సత్వరమే వ్యవసాయ ఆర్టికల్చర్ రెవెన్యూ సిబ్బంది దెబ్బతిన్న పంటలను ఇండ్లను సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు జిల్లా నాయకులు తీగల ఆదిరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు సిపిఎం జిల్లా నాయకులు గుండు రామస్వామి, రైతులు మట్ట వెంకట, పాపిరెడ్డి బాదావత్ బాలు, శివ నాయక్ ,శివరామకృష్ణ, ఈశ్వర్ రావు ,తుమ్మల సుధాకర్ రెడ్డి, బైరి కొండల్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.