5-3తో భారత్ ఘన విజయం
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్
ఆమ్‌స్టల్‌వీన్ : ఎఫ్‌ఐహెచ్ మెన్స్ హాకీ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ముందంజ వేసింది. గ్రూప్ దశలో వరుసగా రెండో విజయం సాధించిన హాకీ ఇండియా.. రెండో రౌండ్‌కు చేరుకుంది. గ్రూప్-డిలో బుధవారం జరిగిన ఆఖరు మ్యాచ్‌లో పొరుగు దేశం పాకిస్తాన్‌పై భారత్ 5-3తో ఘన విజయం సాధించింది. తొలి రెండు క్వార్టర్ల ఆటలో రెండేసి గోల్స్ కొట్టిన భారత్ విజయం లాంఛనం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 5, 21వ నిమిషాల్లో గోల్స్ కొట్టగా.. అభిషేక్ 11వ నిమిషంలో గోల్ సాధించాడు. దీంతో భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అభిషేక్ 24వ నిమిషంలో మరో గోల్ కొట్టగా.. హార్దిక్ సింగ్ 35వ నిమిషంలో భారత్‌కు ఐదో గోల్ అందించాడు. పాకిస్తాన్‌కు షాహిద్ 22, 46వ నిమిషాల్లో గోల్ కొట్టగా.. ఖాన్ 24వ నిమిషంలో గోల్ అందించాడు. గ్రూప్-డిలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలువగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. టాప్-2 జట్లు రెండో రౌండ్‌కు చేరుకున్నాయి. రెండో రౌండ్లో గ్రూప్-ఈలో ఇంగ్లాండ్, భారత్‌తో పాటు గ్రూప్-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పోటీపడనున్నాయి. ఈ ఓటమితో పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది.
పాక్‌పై ఫటాఫట్
- Advertisement -
- Advertisement -



