“నచ్చిన మల్లెలు” పుస్తకావిష్కరణ

– పూర్వ విద్యార్థి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన భూపాలపల్లి విద్యాధికారి రాంకుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1968-69వ బ్యాచ్ పదోవ తరగతి చదుకున్న పూర్వ విద్యార్థి,రిటర్డ్ పిఈటి మల్కా నారాయణ రావు రాసిన ,నచ్చిన మల్లెలు, అనే పుస్తకాన్ని శుక్రవారం తాడిచెర్ల హైస్కూల్ లో భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాంకుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడారు నచ్చిన మల్లెలు పుస్తకాన్ని రాసి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందజేయడం చాలా అభినందనీయమన్నారు.తాను రాసిన పుస్తకాన్ని తాను చదువుకున్న పాఠశాలలో,మిత్రుల,విద్యార్థుల మధ్య డిఈఓచే ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని నారాయణ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.గత సంవత్సరంలో పదోవ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.5వెలు, పేద విద్యార్థులైన ఇద్దరికి రూ.3వేల చొప్పున, క్రీడల్లో ప్రథమ స్థానం రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదనోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు డి.రాజేశ్వర్ రావు,ఎల్ రాజయ్య,సీఎంఓ కిషన్ రావు,ఏఎంఓ లక్ష్మన్ కుమార్,సెక్టోరియల్ అధికారి కరుణాకర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love