నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ బండారి భరద్వాజ్ (ఎంబీబీఎస్, ఎంఎస్)ను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు సోమవారం సన్మానించారు. సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యుడు డి. రామచందర్‌కు ముక్కు సంబంధిత సమస్యతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఓ రోగికి డాక్టర్ భరద్వాజ్ ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి, తక్కువ సమయంలోనే కోలుకునేలా చికిత్స అందించారని కమిటీ సభ్యులు తెలిపారు.
అదేవిధంగా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధుల చికిత్సలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలు చేస్తున్నందుకు గుర్తింపుగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్, కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఎం.ఏ. సలీం శాలువాతో డాక్టర్ భరద్వాజ్‌ను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎం. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



