Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులపై లాఠీచార్జి ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి

విద్యార్థులపై లాఠీచార్జి ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి

- Advertisement -
  • రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంట్ కు సంసద్ చలో యాత్ర చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ చర్యను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై లాఠీచార్జిని ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులపై జరిగినట్లుగా చెబుతున్న లాఠీచార్జిని ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు.

“విద్యార్థులపై లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానం. ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హతను కోల్పోయింది” అని ఖర్గే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “అయోధ్య రామమందిరానికి సంబంధించిన విరాళాల అపహరణ అంశాన్ని కూడా పార్లమెంట్ లో తాము లేవనెత్తాము. ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది మోడీనే కాబట్టి, ఆయనే దీనికి బాధ్యత వహించాలని పార్లమెంట్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ప్రధాని మోడీ నుంచి బాధ్యతాయుతమైన వివరణను ఇవ్వాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -