
నవతెలంగాణ- రెంజల్
ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని బోధన రూరల్ సీఐ నరేష్ స్పష్టం చేశారు. రెంజల్ మండలం నీల గ్రామంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలు ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో పంుగలు జరుపుకోవాలన ఆయన స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవం హిందూ ముస్లిం సోదరులందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. నిమజ్జన సమయంలో యువత మద్యం సేవించకుండా భక్తి శ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని సూచించారు. శోభయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఆయన గ్రామంలో గుంతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయితీ సిబ్బంది సూచించారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు ఏర్పడకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ఎస్సై ఈ. సాయన్న, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సాయిలు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.