హైదరాబాద్ : ప్రముఖ గేమింగ్ సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌కు ఫిక్కీ నుంచి ప్రతిష్టాత్మక బెస్ట్ యానిమేటెడ్ ఫ్రేమ్స్ అవార్డు దక్కింది. ఉత్తమ భారతీయ గేమ్స్ విభాగంలో కంపెనీ అభివృద్థి చేసిన రోలర్ కోస్టర్ గేమ్‌కు ఈ గుర్తింపు అందుకుంది. ముంబయిలో ఇటీవల జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫిక్కీ) కార్యక్రమంలో 7సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ మారుతీ శంకర్ ఈ అవార్డును స్వీకరించారు. రోలర్ కోస్టర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌పై 20 లక్షల పైగా డౌన్లోడ్లను నమోదు చేసింది. తాము రూపొందించిన అల్టిమేట్ కార్ రేసింగ్, మాన్‌స్టర్ ట్రక్ 3డీ గేమ్స్ బెస్ట్ మొబైల్, ట్యాబ్లెట్ గేమ్ విభాగాల్లో ఫైనల్‌కు చేరాయని మారుతీ శంకర్ తెలిపారు.. తక్కువ నిడివి గల ‘గేమర్ షార్ట్స్’ యాప్‌నకు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు పేర్కొన్నారు.