నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన బోయపర్తి లచ్చయ్య కుమార్తె ప్రశాంతి వివాహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్ కు గురువారం హైదరాబాదులోని తమ నివాసంలో ఆహ్వానం పత్రికను అందజేశారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో మండలంలోని ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గౌరవంగా ఉందని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తను అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోయపర్తి లింగయ్య , బోయపర్తి గణేష్ జాల జగన్, ఒగ్గు సైదులు ,బోయపర్తి సంజీవ, రామలింగయ్య, గిరి, సాయికుమార్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.