మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కూతురు వివాహ ఖర్చుల నిమిత్తం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రూ. పదివేల ఆర్థిక సహాయం అందజేశారు.పేద కుటుంబానికి చెందిన భాగ్యలక్ష్మి కూతురు వివాహం నిశ్చయమైంది. పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన వివాహ ఖర్చుల నిమిత్తం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని తన అనుచరులతో పంపించారు. మంగళవారం ఆ ఆర్థిక సహాయాన్ని వెల్కటూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగ్యలక్ష్మి కి అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సోమ్ రవి, నాయకులు సోం రాజేందర్, సోమ్ రవీందర్ సతీష్, శ్రీనివాస్, రంజిత్, కిట్టయ్య, సురేష్, సలిం, రాజ్ మహమ్మద్, మహిపాల్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.