
శ్రీనివాసులు, బాలకిష్టయ్య లురోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని మాక్స్ క్యూర్ హాస్పిటల్, కామినేని హాస్పిటల్ లలో చికిత్సపొందుతున్నారు. వారికి మాల ఉద్యోగుల ఐక్య వేదిక అచ్చంపేట డివిజన్ ఆధ్వర్యంలో ఇద్దరికీ 40 వేల చొప్పున 80 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పంబ నారాయణ , అధ్యక్షులు కల్ముల ఆంజనేయులు , ప్రధాన కార్యదర్శి నారుమోళ్ళ రవిందర్, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జీవన్ కుమార్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బందెల జనార్ధన్ , ఉపాధ్యక్షులు ఇమ్మడి సైదులు ఉన్నారు.