మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్బి- మౌలానా, అనే పేద ముస్లిం మైనారిటీ వృద్ధ దంపతులకు సోమవారం జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ తాడ్వాయి శాఖ ఆధ్వర్యంలో రూ. 9వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందించారు. నిరుపేద కుటుంబాల వారికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ తాడ్వాయి శాఖ మండల అధ్యక్షులు మొరే నాగేశ్వరరావు, సభ్యులు తిరుపతి రతన్, కార్తీక్, మోరే బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.