మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం

Financial assistance to the bereaved familyనవతెలంగాణ – రాయపోల్ 

ఒకే కుటుంబానికి చెందిన అన్న చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు. మంగళవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో సంవత్సరం క్రితమే తల్లి శ్యామల అనారోగ్యంతో మృతి చెందడం, ఇప్పుడు అన్న రమేష్ చెల్లెలు కళ్యాణి ఒకేరోజు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం చాలా బాధాకరం. ఒకే కుటుంబంలో అన్న చెల్లెలు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని విషాదకరమైన పరి్థితికి తెచ్చిందన్నారు. వారి కుటుంబంలో ఐదుగురు సభ్యులకు ఇప్పుడు కిష్టయ్య, పెద్ద కుమారుడు మహేష్ ఇద్దరు మాత్రమే మిగిలారని, ఇలాంటి హృదయ విషాదకరమైన సంఘటన ఏ కుటుంబానికి రాకూడదని శోకతప్త హృదయంతో పేర్కొన్నారు. వీరి మృతితో ఇందుప్రియాల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నదని, కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్, కళ్యాణి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కిష్టయ్య కుటుంబానికి తమ వంతు సహకారంగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love