అగ్ని ప్రమాద బాధితులకి ఆర్థిక చేయూత 

Financial assistance to fire victimsనవతెలంగాణ – గోవిందరావుపేట 
ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన టెంట్ హౌస్ అసోసియేషన్ సభ్యులు అశోక్ కుటుంబానికి అసోసియేషన్ తోటి సభ్యులు ఆర్థికచేయుతను అందించారు. బుధవారం అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ అతనికి ఆర్థిక చేయూత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు  2 లక్షల రూపాయలను వడ్డీ లేకుండా ఐదు నెలల పాటు టెంట్ హౌస్ అసోసియేషన్ సభ్యులు చేయూత ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెంట్ హౌస్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి కర్ణాకర్ రెడ్డి, సభ్యులు చేల్పూరి రాజకుమార్, అంకం వినయ్ కుమార్, అన్నే గౌతమ్ కుమార్, పేర్వాల సురేష్, చందుపట్ల మచ్చ గిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love