క్రీడలతో దేహదారుఢ్యం

నవతెలంగాణ – ఉప్పునుంతల : 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల యందు గత మూడు రోజులుగా విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జటప్రోలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, పీఈటి పర్వతాలు గారి పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సహకారంతో ఈ క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి.  ముగింపు సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని, విద్యార్థులలో నైతికత, సహకార భావం పెంపొందింపజేస్తాయని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ అనంతరం బహుమతి ప్రదానం గావించబడుతుందని పీఈటి పర్వతాలు తెలిపారు.
Spread the love