ఓపెన్‌కాస్ట్‌ గని కార్మికల సమస్యలు పరిష్కరించండి

– ఏఐటీయూసీ ఎస్సార్పీ ఏరియా కార్యదర్శి బాజీసైదా
నవతెలంగాణ-జైపూర్‌
ఇందారం ఓపెన్‌కాస్ట్‌ గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యం తక్షనమే స్పందించాలని శ్రీరాంపూర్‌ ఏరియా ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్‌కే బాజీసైదా డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏఐటీయూసీ, ఓసీ కార్మికులతో కలిసి గని మేనేజర్‌ను కలిసి వినతీ పత్రం అందజేసిన ఆయన ఓసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఓసీ మేజేర్‌ వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గత రెండు నెలలుగా కన్వీనెన్స్‌ వేహికిల్‌ అందుబాటులో లేకపోవడం కార్మికులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. కార్మికుల సౌకర్యార్థం వెంటనే కన్వీనెస్‌ వాహణం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వేడ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజీవ్‌ వెకిల్‌ ఉండటం వలన ఇక్కడ వెహికిల్‌ అందుబాటులో ఉండక పోవటం, అదేవిధంగా ఎంవీ డ్రైవర్స్‌, ఓవర్‌మెన్స్‌ ఈపీ, ఎలక్ట్రిషియన్స్‌, జనరల్‌ మజ్దూర్ల కొరతను గుర్తించాలని అన్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈపీ ఆపరేటర్స్‌, సర్వేయర్స్‌ రూంలో మధ్యన గత స్విచ్‌ స్టేషన్‌ వెంటనే మర్చాలని డిమాండ్‌ చేశారు. ఈపీ ఆపరేటర్స్‌ కొరతపై దృష్టి సారించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో కూడా కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

Spread the love