– సెన్సెక్స్ 200 పాయింట్ల పతనం
ముంబయి : బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి స్టాక్స్‌ల్లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను నష్టాలకు గురి చేశాయి. రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్న.. బిఎస్‌ఇ సెన్సెక్స్ తుదకు 201 పాయింట్లు లేదా 0.25 శాతం కోల్పోయి 81,508.46కు పడిపోయింది. ఇంట్రాడేలో 81,783-81,412 మధ్య కదలాడింది. నిఫ్టీ 58.80 పాయింట్ల నష్టంతో 24,619.00 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గి 84.74 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్ 30లో హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు ఎల్‌అండ్‌టి, టాటా స్టీల్, జెఎఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు అధికంగా లాభపడ్డాయి. నిఫ్టీలో ఫైనాన్సీయల్ సర్వీసెస్, ఐటి, లోహ, రియాల్టీ సూచీలు రాణించాయి.