ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొని తుదకు యథాతథంగా ముగిశాయి. ఉదయం పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 0.39 పాయింట్ల నష్టంతో 78,472 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 78,898 – 78,173 పాయింట్ల మధ్య కదలాడింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ-50 సూచీ నిఫ్టీ 22.55 పాయింట్ల నష్టంతో 23,570.20 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ50 స్టాక్స్‌ల్లో 31 స్టాక్స్ సానుకూలంగా ట్రేడింగ్ అయ్యాయి.